: పవన్ నినాదం తెలంగాణలో పనిచేయదు: ఉత్తమ్ కుమార్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నినాదమైన 'కాంగ్రెస్ హఠావో, దేశ్ బచావో' తెలంగాణ ప్రాంతంలో పనిచేయదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో సీపీఐ, మజ్లిస్ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. టీఆర్ఎస్ తో మాత్రం పొత్తు ఉండదని స్పష్టం చేశారు.