: ఇదేనా కేసీఆర్ చెప్పే తెలంగాణ పునర్నిర్మాణం?: నాగం
ఇల్లు కట్టకుండానే పాలు పొంగిస్తున్న తీరుతో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు హామీలిస్తూ మోసం చేస్తున్నారని బీజేపీ నేత నాగం జనార్ధనరెడ్డి ఆరోపించారు. తెలంగాణ ద్రోహులందరినీ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుంటున్నారని... ఇదేనా తెలంగాణ పునర్నిర్మాణం? అని ప్రశ్నించారు. బలహీనపడిన టీఆర్ఎస్ ను బలోపేతం చేసుకోవడానికి ద్రోహులను కూడా చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఎప్పుడు ఉద్యమం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యోగులకు, ప్రజలకు ప్రయోజనం చేకూరాలంటే... అది కేవలం బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు శంకుస్థాపన జరిగిందని... అదొక అక్రమ ప్రాజెక్టు అని అప్పుడు కేసీఆర్ కు తెలియదా? అని ప్రశ్నించారు.