: ఈ నెల 25 నుంచి సీమాంధ్రలో బీజేపీ ప్రచారం
సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని గెలిపించుకునేందుకు రాష్ట్ర బీజేపీ సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి సీమాంధ్రలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్నట్లు ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తెలిపారు. మోడీని ప్రధాని చేయాలనే నినాదంతో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.