: ఏడుగురు కీచకులు కలబడ్డారు...ఇండోర్ లో దారుణం
సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆడదానికి రక్షణ లేకుండా పోతోంది. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు కీచకుల్లా మారి దేశ పరువు ప్రతిష్ఠలతో పాటు మగాళ్లపై ఏహ్యభావం పెంచుతున్నారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో దారుణం జరిగింది. తన కుమార్తె ఇంటికి వెళ్లి వస్తున్న ఓ మహిళకు మద్యం తాగించి ఏడుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.