: తిరుమల అడవులు కాలిపోవడానికి కారణం జగన్: రాజేంద్రప్రసాద్
తిరుమలలో శేషాచలం అడవులు కాలిపోవడానికి కారణం వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత జగన్ చెప్పులు వేసుకెళ్లి దేవుడ్ని అవమానించాడని, అందుకే తిరుమల శేషాచలం అడవుల్లో దావానలం పుట్టి అడవిని దహించివేసిందని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే జగన్, కేవీపీ ల ఆస్తులను జప్తు చేస్తామని, వాటితో రైతులకు రుణమాఫీ చేస్తామని ఆయన తెలిపారు.