: సోనియా ఆదేశంతోనే ఉప ప్రణాళిక : పనబాక లక్ష్మి
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాల మేరకే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను అమలుచేసినట్లు కేంద్ర సహాయ మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. పేద, బడుగు, బలహీన వర్గాల కోసమే కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేకంగా బడ్జెట్ లు రూపొందించాయన్నారు. దళారుల నుంచి రక్షించేందుకే దేశంలో నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పనబాక చెప్పారు.