: ముప్పై శాతం మంది బీజేపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కళంకితులే!


బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల్లో 30 శాతం మంది నేరచరిత ఉన్న వ్యక్తులే అని ఓ సర్వే చెబుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికల బరిలోకి దించిన ప్రతి ముగ్గురిలో ఒకరిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. ఇప్పటివరకు ఈ రెండు పార్టీలు 469 మంది అభ్యర్థులను ప్రకటించగా, వాటిలో 280 అఫిడవిట్లను సర్వేలో భాగంగా పరిశీలించారు.

35 శాతం బీజేపీ నేతలు క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటుండగా, వారిలో 17 శాతం తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్నారట. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి 27 శాతం ప్రజాప్రతినిధులు క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటుండగా, 10 శాతం తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News