: దేశాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా చేస్తా: వైగో


లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ, డీఎండీకేలతో పొత్తుపెట్టుకుని పోటీ చేస్తున్న ఎండీఎంకే నేత వైగో తన మేనిఫెస్టో విడుదల చేశారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఇండియాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియాగా మారుస్తానని ప్రకటించారు. అధికారం అంతా ఢిల్లీలోనే కేంద్రీకృతం అయిందని, అందుకే దేశాన్ని శక్తిమంతం చేసేందుకు పేరు మారుస్తానన్నారు. దేశంలో ఎల్టీటీఈపై కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే, తమిళ భాషను దేశ అధికార భాష చేయిస్తానని ప్రకటించారు. మరణశిక్ష రద్దు చేయించడం, కూడంకుళం అణువిద్యుత్ ప్లాంట్ ను మూసేయించడం, జాలర్లు, పర్యావరణ ప్రభావాన్ని పరిశీలించాకే సేతు సముద్రంలో ముందుకు వెళ్లడం, కేంద్ర పన్నుల ఆదాయంలో సగం రాష్ట్రాలకే ఇవ్వడం తదితర అంశాలు ఇందులో ఉన్నాయి.

  • Loading...

More Telugu News