: పోటీచేసే విషయంపై రెండు రోజుల్లో చెబుతా: కల్మాడీ


కామన్ వెల్త్ క్రీడల్లో చోటు చేసుకున్న స్కాం నేపథ్యంలో సీనియర్ నేత సురేష్ కల్మాడీకి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేయాలనుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నిన్న (శుక్రవారం) మద్దతుదారులతో తన నివాసంలో సమావేశమైన కల్మాడీ, రెండు రోజుల్లో ఎన్నికల్లో పోటీచేసే విషయంపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. పుణె లోక్ సభ సిట్టింగ్ ఎంపీ అయిన కల్మాడీ స్థానంలో విశ్వజీత్ కథమ్ ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. దీనిపై కల్మాడీని సంప్రదిస్తే, విశ్వజీత్ కు మద్దతు తెలపాలని మహారాష్ట్ర మంత్రి హర్షవర్ధన్ పాటిల్ తనను అడిగారని చెప్పారు. తన మద్దతుదారులను అడిగి చెబుతానన్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News