: చైనాలో వాక్ స్వాతంత్ర్యంపై గళమెత్తిన ఒబామా సతీమణి


అమెరికా ప్రథమ పౌరురాలు, అధ్యక్షుడి సతీమణి మిషెల్లే వాక్ స్వాతంత్ర్య ప్రాధాన్యతను చైనాలో నొక్కి చెప్పారు. తల్లి, ఇద్దరు కూతుళ్ళతో కలసి చైనా పర్యటనకు వచ్చిన ఆమె బీజింగ్ లో పెకింగ్ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మాట్లాడే స్వేచ్ఛ, సంకెళ్లు లేని సమాచార లభ్యత.. ఇవే ఆయా దేశాలు బలమైనవిగా మారడానికి దోహదం చేస్తాయని మిషెల్లే అన్నారు. ఇవి సార్వత్రిక హక్కులుగా చెప్పారు.

సమాచార పంపిణీ అనేది కట్టడి లేకుండా జరిగిపోవాలని... అప్పుడే ఏమి జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. చైనా ప్రభుత్వం ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర విదేశీ సైట్లను బ్లాక్ చేయడంతోపాటు, చాలా వెబ్ సైట్లపై కఠినమైన ఆంక్షలు, నియంత్రణలు, సెన్సార్ విధిస్తోంది. ఈ విధానం తప్పని మిషెల్లే పరోక్షంగా చైనా పాలకులకు సూచించారు. ఇరు దేశాల మధ్య విద్యా కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు ఆమె చైనాలో పర్యటిస్తున్నారు.

  • Loading...

More Telugu News