: యూరప్ లో టీసీఎస్ నెంబర్ వన్


ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) యూరప్ లోనే అగ్రగామి ఉద్యోగ సంస్థగా ఖ్యాతి దక్కించుకుంది. టాప్ ఎంప్లాయర్స్ ఇన్ స్టిట్యూట్ అనే సంస్థ రూపొందించిన ప్రముఖ సంస్థల జాబితాలో టీసీఎస్ కు తొలి స్థానం లభించింది. టీసీఎస్ ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం వరుసగా ఇది రెండోసారి. కిందటేడాది కూడా ఈ భారత సంస్థ నెంబర్ వన్ గా నిలిచింది.

కంపెనీ మానవ వనరులు, ప్రధాన స్థితిగతులు, ప్రయోజనాలు, శిక్షణ, ఉద్యోగ ఉన్నతి, సంస్థ సంస్కృతి వంటి అంశాలు టీసీఎస్ కు ఈ స్థానాన్ని అందించాయి. కాగా, ఈ విషయమై స్పందిస్తూ, ఇకపైనా ఇదే ఒరవడి కొనసాగిస్తామని టీసీఎస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, కంపెనీ మానవ వనరుల గ్లోబల్ హెడ్ అజయ్ ముఖర్జీ చెప్పారు.

  • Loading...

More Telugu News