: నవ యవ్వన కాంగ్రెస్ గా దూసుకుపోతుంది: చిరంజీవి
కాంగ్రెస్ పార్టీని సీనియర్ నేతలంతా వీడడంతో యువకులకు మంచి అవకాశం దొరికిందని కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, యువతరానికి ఇది కొత్త అవకాశం అని అభిప్రాయపడ్డారు. తనను గుర్తించి కేంద్ర మంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీ, యువతరాన్ని కూడా అలాగే గుర్తిస్తుందని ఆయన తెలిపారు. కొత్త వారు, యువకులు కాంగ్రెస్ లోకి వస్తే యువతరంతో కాంగ్రెస్ పార్టీ తొణికిసలాడుతుందని ఆయన అన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు పుంజుకుని విజయం సాధిస్తుందని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.