: ఉస్మానియాలో గవర్నర్ పర్యటన రద్దు


హైదరాబాదు, ఉస్మానియా యూనివర్శిటీ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పాల్గొనడం లేదు. యూనివర్శిటీ 79 వ స్నాతకోత్సవం ఈ రోజు జరుగుతున్న విషయం తెలిసిందే. యూనివర్శిటీ చాన్సలర్ హోదాలో గవర్నర్ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సివుంది. అయితే, ఉస్మానియా విద్యార్ధులు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, బంద్ కు పిలుపునివ్వడంతో గవర్నర్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. మరోపక్క ఉస్మానియాలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు.  

  • Loading...

More Telugu News