: జగన్ వల్లే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యం: ముత్యాలపాప
ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం జగన్ వల్లే సీమాంధ్ర రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ముత్యాల పాప అన్నారు. ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ సమక్షంలో ఆమె ఆపార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్థానిక సంస్థలు, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు.