: పాపాలు కడిగేసుకునేందుకే వారణాసి నుంచి మోడీ: లాలూ
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. గుజరాత్ అల్లర్లు, గోద్రా ఘటనల్లో చేసిన పాపాలు కడిగేసుకునేందుకే వారణాసి నుంచి మోడీ పోటీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే, ఇక్కడది సాధ్యం కాదని అన్నారు. దేశ ప్రజలు ఎప్పుడూ ఆయనను క్షమించరని అన్నారు. ప్రస్తుతం బీహార్ లో ప్రచారంలో ఉన్న లాలూ ఈ మేరకు మీడియా ముందు విమర్శలు చేశారు. బీహార్ లో మోడీ హవా ఏమాత్రం లేదని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మోడీ ఎలాంటి ప్రభావం చూపలేరని చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న లాలూ పార్టీ ఆర్జేడీ... బీహార్ లోని మొత్తం 40 లోక్ సభ స్థానాల్లో 27 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన 12 స్థానాల్లో కాంగ్రెస్, ఒక్క స్థానంలో ఎన్సీపీ పోటీ చేస్తున్నాయి.