: యూపీఏలో రెండు అధికార కేంద్రాల ప్రయోగం విఫలం: దిగ్విజయ్
యూపీఏలో రెండు అధికార కేంద్రాల ప్రయోగం విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ అన్నారు. ప్రధానమంత్రి పీఠానికి సోనియాగాంధీ ఒక నేతను ప్రతిపాదించినట్లుగా రాహుల్ చేయరాదన్నారు. ''వ్యక్తిగతంగా రెండు అధికార కేంద్రాల ప్రయోగం ఫలితమివ్వలేదని భావిస్తున్నాను. రెండు అధికార కేంద్రాలు ఉండకూడదని అనుకుంటున్నా. ప్రధాని అభ్యర్థే సొంతంగా పాలించేలా ఉండాలి'' అని దిగ్విజయ్ అన్నారు. ప్రభుత్వ వ్యవహారాలలో సోనియా ఎప్పుడూ తలదూర్చలేదని ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దిగ్విజయ్ స్పష్టం చేశారు. అంటే సోనియా, ప్రధాని రెండు అధికార కేంద్రాలని దిగ్విజయ్ మాటల అర్థంగా తెలుస్తోంది.