: మాల్దీవుల్లో మొదలైన పోలింగ్


మాల్దీవుల్లో పార్లమెంటు ఎన్నికలకు పోలింగ్ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 4గంటలకు ముగుస్తుంది. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూలలో వేచి ఉన్నారు. 85 నియోజకవర్గాలకు మొత్తం 302 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మాల్దీవులకు వెలుపల శ్రీలంకలో రెండు, భారత్ లో రెండు, మలేసియాలో ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గతేడాది నవంబర్ లో అధ్యక్షుడిగా అబ్దుల్లా యమీన్ ఎన్నికయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో వీటికి ప్రాధాన్యం ఏర్పడింది. ప్రస్తుతం ప్రొగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ కు చెందిన యమీన్ చేతిలో అధ్యక్షపీఠం ఉండగా.. పార్లమెంటులో మాత్రం మాల్దీవ్స్ డెమొక్రటిక్ పార్టీ ఆధిక్యం కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News