: శ్రీవారిని దర్శించుకున్న రాయపాటి


తిరుమల శ్రీవారిని ఈ ఉదయం కాంగ్రెస్ బహిష్కృత గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 31న టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు. సీమాంధ్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News