: శేరిలింగంపల్లి నుంచి పోటీ చేస్తానన్నది అవాస్తవం: ఎర్రబెల్లి
హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారన్న వార్తలకు టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ముగింపు పలికారు. తనకు శేరిలింగంపల్లి నుంచి పోటీ చేయాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా పాలకుర్తి లేదా వరంగల్ తూర్పు స్థానాలలో ఎక్కడో ఒక చోటు నుంచి పోటీ చేస్తానని తెలిపారు. ఒకవేళ మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ కేటాయిస్తే మాత్రం... జిల్లా మారుతానని చెప్పారు.