: సేల్స్ మెన్ లా వచ్చి.. ఢిల్లీలో కాంగో యువతిపై అత్యాచారం!


ఢిల్లీలో మరో విదేశీ వనితపై అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. కాంగోకు చెందిన ఓ యువతి కంప్యూటర్ కోర్సులు చేసేందుకు భారత్ కు వచ్చి దక్షిణ ఢిల్లీలోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఆమె ఫ్లాట్ కు నిన్న ఇద్దరు వచ్చి తలుపుతట్టారు. తలుపు తీయగా తాము సేల్స్ మెన్ అంటూ డ్రెస్ లు చూపించారు. లోపలకు ఆహ్వానించి డ్రెస్ లు చూస్తుండగా.. ఇంతలో వారు బలప్రయోగంతో ఆమెపై అత్యాచారం చేశారు. ఈమేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఆమె ప్రకటనల్లో అస్పష్టత ఉండడంతో పోలీసులు ఆమె ఉండే అపార్ట్ మెంట్ ప్రవేశద్వారం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. నిన్న సేల్స్ మెన్ ఎవరూ రాలేదని వెల్లడైంది. దీంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News