: రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటున్న చంద్రబాబు
విభజన నేపథ్యంలో్ రాష్ట్రం నేడు క్లిష్ట పరిస్థితుల నడుమ విలవిల్లాడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కాంగ్రెస్ కు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని బాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ను భూస్థాపితం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏమీ తెలియనివాళ్ళు కూడా తనను విమర్శించడం చూస్తుంటే నవ్వొస్తోందని అన్నారు. ఎవరినీ సంప్రదించకుండానే కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసిందని బాబు దుయ్యబట్టారు. కర్నూలు ప్రజాగర్జన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.