: సినీ నటులకు ప్రత్యేక చట్టాల్లేవు: వెంకయ్యనాయుడు
దేశంలో చట్టాలు అందరికీ సమానమేనని, సినీ నటులకు ప్రత్యేక చట్టాలేవీ లేవని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. అనంతపురం పట్టణంలో బీజేపీ ప్రజా చైతన్య సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. సంజయ్ దత్ కు శిక్ష పడడం సరైనదేనన్నారు. ఇక, ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకునే శ్రీలంక క్రికెటర్లపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిషేధం విధించారని ఆమె చర్యను వెంకయ్య సమర్థించారు.
ఇదే సభలో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రజలు కాంగ్రెస్ అంతం కోరుకుంటున్నారని అన్నారు. అవిశ్వాసం విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరించిన తీరు దుర్మార్గమైనదిగా వ్యాఖ్యానించారు.