: ఆసియా దేశాలవైపు చూస్తున్న రష్యా
క్రిమియా విషయంలో పశ్చిమ దేశాల ఆగ్రహానికి గురైన రష్యా ఇప్పుడు ఆసియా దేశాలవైపు దృష్టి సారించింది. ఆసిియాలోని పలు కీలకదేశాలతో బాంధవ్యాలు నెరిపిందేకు రష్యా అధినాయకగణం తహతహలాడుతోంది. ఈ మేరకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనకు నమ్మిన బంటు అయిన లెఫ్టినెంట్ ఇగోర్ సెచిన్ ను తూర్పు దేశాల వద్దకు దూతగా పంపారు. ఈ క్రమంలో సెచిన్ జపాన్ లో పర్యటించి అక్కడి నేతలతో చర్చించారు. అమెరికాతో పాటు యూరప్ కూడా రష్యాను ఏకాకిని చేయాలని ప్రయత్నిస్తే ఆసియా దేశాలతో వాణిజ్య, సైనిక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని రష్యాలోని ఓ చమురు సంస్థ అధిపతి స్పష్టం చేశారు.
కాగా, పుతిన్ మేలో చైనాలో పర్యటించనున్నారు. ఆ పర్యటనలో ఆయన కీలకమైన సహజవాయు సరఫరా ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశముంది. చైనాతో చెలిమి సాధ్యమైతే రష్యాకు ఇక పశ్చిమదేశాలతో పని ఉండదన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం.