: విమానం ఆచూకీ ఇప్పట్లో కష్టమే!
మలేసియా విమానం కనిపించకుండాపోయి రెండు వారాలు కావస్తున్నా గాలింపు చర్యలు ఫలితాన్నివ్వలేదు. చీకట్లో చిరుదీపంలో కనిపించిన హిందూ మహాసముద్రంలో అనుమానాస్పద శకలాలు గాలింపు విమానాలకు కనిపించకపోవడంతో ఆ ఆశా ఆవిరైంది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో విమానం ఆచూకీ లభ్యంకావడం కష్టమేనని మలేసియా అంటోంది. నేడు సాగించిన గాలింపు చర్యలు వృథా ప్రయాసగానే మిగిలిపోయాయి. హిందూ మహాసముద్రంపై వాతావరణం కూడా అన్వేషణకు ఆటంకం కలిగించింది.