: కాపు రాంచంద్రారెడ్డికి బెయిల్
వైఎస్సార్సీపీ నేత కాపు రాంచంద్రారెడ్డికి బెయిల్ మంజూరైంది. ఈ మేరకు అనంతపురం జిల్లా రాయదుర్గం కోర్టు ఆయనకు పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. 680 బాక్సుల్లో జగన్, కాపు ఫొటోలు ఉన్న గోడ గడియారాలను రాయదుర్గం తరలిస్తుండగా నిన్న (గురువారం) పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో వీటిని తరలించడంతో కాపును ఈ రోజు అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు.