: గాళ్ ఫ్రెండ్స్ వద్ద ఫోన్లు కొట్టేసిన ఘనుడు!


చైనాలోని షాంఘై నగరంలో ఓ వ్యక్తి ఏడుగురు అమ్మాయిలతో స్నేహం చేసి వాళ్ళ ఫోన్లతో ఉడాయించాడు. అవి అల్లాటప్పా ఫోన్లు కాదండోయ్. ఆపిల్ వారి ఐఫోన్లు. ఫెంగ్ (26) అనే ఈ ఘనుడు 2012లో కాయ్ అనే యువతితో వియ్ చాట్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. స్నేహం కాస్త బలపడ్డాక ఓరోజు ఆమె ఫోన్ ను కొన్నాళ్ళు వాడుకుంటానని తీసుకున్నాడు. ఫోన్ తీసుకుని పత్తాలేకుండా పోయాడు. ఇదే విధంగా మరో ఆరుగురు అమ్మాయిలతో స్నేహం నటించిన ఫెంగ్ వారి ఐఫోన్లతో పరారయ్యాడు. దీంతో, అతగాడిని దొరకబుచ్చుకున్న పోలీసులు విచారించగా నేరం అంగీకరించాడు. మోసపూరిత చర్యలకు పాల్పడ్డాడంటూ అతగాడిపై అభియోగాలు మోపారు షాంఘై పోలీసులు.

  • Loading...

More Telugu News