: జశ్వంత్ సింగ్ కి బీజేపీ ఝలక్
బీజేపీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ కి బీజేపీ ఝలకిచ్చింది. రాజస్థాన్ లోని బార్మార్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానన్న జశ్వంత్ సింగ్ కు ఆ స్థానాన్ని కేటాయించలేదు. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన రిటైర్డ్ కల్నల్ సోనారామ్ చౌధరికి బార్మార్ స్థానాన్ని కేటాయించింది. 76 ఏళ్ల జశ్వంత్ సింగ్ పార్టీ అధిష్ఠానంతో మాట్లాడుతూ, తనకు ఇవే చివరి ఎన్నికలు కావొచ్చని, అందుకే తాను పుట్టిన ఊరి నుంచే ఎన్నికల బరిలో దిగుతానని స్పష్టం చేశారు.
ఒక వేళ తనకు సీటు కేటాయించకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో దిగుతానని జశ్వంత్ సింగ్ పార్టీ అధిష్ఠానానికి తెలిపారు. కానీ రాజస్థాన్ లో అభ్యర్థుల ఎంపికలో వసుంధర రాజె అభిప్రాయానికి పెద్దపీట వేసిన బీజేపీ జశ్వంత్ సింగ్ కు షాకిచ్చింది.