: డీఆర్ఎస్ విషయంలో కుంబ్లేను ఒప్పిస్తే, బీసీసీఐని ఒప్పించినట్టే: ఐసీసీ
డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) అమలుపై భారత్ ను ఒప్పించేందుకు ఐసీసీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఐసీసీ క్రికెట్ కమిటీ చీఫ్ గా వ్యవహరిస్తున్న అనిల్ కుంబ్లేను డీఆర్ఎస్ విషయంలో ఒప్పించగలిగితే బీసీసీఐ సమ్మతి పొందడం పెద్ద కష్టం కాబోదని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్ అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్ లోని మిర్పూర్లో ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
'ఐసీసీ సభ్య దేశాల్లో డీఆర్ఎస్ అమలు తీరు ఎలా ఉందో పర్యవేక్షించే వర్కింగ్ గ్రూప్ లో అనిల్ కుంబ్లే కూడా ఓ సభ్యుడు. డీఆర్ఎస్ పై మొదట కుంబ్లేను సంతృప్తి పరిచేందుకు యత్నిస్తాం. బీసీసీఐ కూడా చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి' అని రిచర్డ్సన్ పేర్కొన్నారు.