: రాజకీయాలతో ఆటలను ముడిపెట్టడం దురదృష్టకరం: లంక హై కమిషనర్


ఐపీఎల్-6లో  శ్రీలంక ఆటగాళ్లను ఆడనిచ్చేదిలేదన్న తమిళనాడు సర్కారు నిర్ణయంపై లంక  హై కమిషనర్ ప్రసాద్ కరయవాసం స్పందించారు. దేశ రాజకీయాలతో ఆటలను ముడి పెట్టడం అత్యంత దురదృష్టకర అంశమని వ్యాఖ్యానించారు. అయితే, భారత్ లో శ్రీలంక క్రీడాకారుల భద్రతే తమకు ప్రధానమని చెప్పారు. 

చెన్నై వేదికగా జరగనున్న10 ఐపీఎల్ మ్యాచుల్లో లంక ఆటగాళ్లను ఆడనివ్వబోమంటూ సీఎం జయలలిత నిన్న ప్రధానికి రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రికెటర్లు ఆడబోరని ఐపీఎల్ పాలక మండలి కూడా ప్రకటించింది. 

  • Loading...

More Telugu News