: మోడీతో సమావేశమైన పవన్ కల్యాణ్
బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. అహ్మదాబాద్ లో బీజేపీ నేత సోము వీర్రాజుతో కలసి మోడీతో పవన్ సమావేశమయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మద్దతు, రాష్ట్ర రాజకీయాలు, అభివృద్ధి, పంపకాలు, నీటి వాటాలు, విద్య, విద్యుత్, వైద్యం తదితర అంశాలపై పవన్ కల్యాణ్ మోడీతో చర్చిస్తున్నారు.