: కేసీఆర్ వి అహంకారపూరిత వ్యాఖ్యలు : పొన్నాల
బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని కావడం వల్లే కేసీఆర్ అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల్లో అభ్యర్థులను పోటీకి పెట్టలేని అశక్తతతో కేసీఆర్ తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.