: జీమెయిల్ సర్వీసులపై గూఢచర్యం కుదరదిక!
జీమెయిల్ ఖాతాదారులకు ఓ శుభవార్త! ఇకపై జీమెయిల్ ద్వారా పంపే ఈమెయిళ్ళకు అదనపు భద్రత కల్పించాలని గూగుల్ నిర్ణయించింది. తద్వారా ఈమెయిల్ సర్వీసులపై గూఢచర్యం నెరపడం అసాధ్యమవుతుంది. అన్ని ఈమెయిళ్ళను ఎన్ క్రిప్ట్ చేయడం ద్వారా గూఢచర్యానికి అడ్డుకట్ట పడుతుందన్నది గూగుల్ యోచన. ఇకపై ఖాతాదారులకు, జీమెయిల్ సర్వర్లకు మధ్య మరొకరు ప్రవేశించడం దుస్సాధ్యమని గూగుల్ వర్గాలు తెలిపాయి.