: కేసీఆర్ ఎన్ని చెప్పినా తెలంగాణ ఇచ్చిందెవరో ప్రజలకు తెలుసు: గండ్ర
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్ని ఆరోపణలు చేసినా, ఎంత మభ్యపెట్టినా ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ తెచ్చానని చెప్పుకుంటున్న కేసీఆర్ సంగతి అందరికీ తెలిసిందేనని అన్నారు. కేసీఆర్ ఎన్ని చెప్పినా తెలంగాణ ఇచ్చిందెవరో తెలంగాణ ప్రజలకు తెలుసని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండూ కలిసి పోటీ చేయాలని ప్రజలు కోరుకున్నారని, కేసీఆర్ తీరు వల్ల అది సాధ్యం కాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరెన్ని చెప్పినా తెలంగాణ ఛాంపియన్ కాంగ్రెస్ అని, ఎన్నికల ఫలితాలతో ఆ విషయం రుజువు అవుతుందని ఆయన స్పష్టం చేశారు.