: టీఆర్ఎస్ అభద్రతా భావంలో ఉంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి
టీఆర్ఎస్ ఆత్మ విశ్వాసం కోల్పోయిందని... అభద్రతా భావంలో ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే ఇతర పార్టీల నేతలను ఆకర్షించే పనిలో పడిందని విమర్శించారు. సామాజిక న్యాయమా? కుటుంబపాలనా? అనే విషయం తేల్చుకునే దిశగా తెలంగాణ ప్రజలు ఓటు వేయబోతున్నారని చెప్పారు.