: తాలిబాన్ల దాడిలో భారతీయుడి మృతి


ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు పేట్రేగిపోతున్నారు. రాజధాని కాబూల్ లోని ఓ ప్రముఖ హోటల్ పై విరుచుకుపడిన తాలిబాన్లు తొమ్మిది మందిని పొట్టనబెట్టుకున్నారు. మరణించిన వారిలో ఓ భారతీయుడు కూడా ఉన్నట్టు ఆఫ్ఘన్ అధికార వర్గాలు తెలిపాయి. టీనేజి ప్రాయంలో ఉన్న నలుగురు తాలిబాన్ మిలిటెంట్లు సాక్సుల్లో పిస్టళ్ళు పెట్టుకుని హోటల్లో ప్రవేశించి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. కాగా, ఈ సందర్భంగా భద్రత దళాల కాల్పుల్లో ఆ నలుగురు హతమయ్యారు.

  • Loading...

More Telugu News