: మోడీపై పోటీ చేయాలో వద్దో వారణాసి ప్రజలనే అడుగుతా: కేజ్రీవాల్
ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అందరి దృష్టి వారణాసిపై ఉంటుందనడంలో సందేహంలేదు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అక్కడి నుంచే పోటీ చేస్తుండడంతో వారణాసి హాట్ టాపిక్ గా మారింది. కాగా, అక్కడ మోడీపై పోటీ చేసేందుకు సమర్థుల్లేక కాంగ్రెస్ నానాతిప్పలు పడుతుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ మాత్రం సై అంటూ బరిలో దూకారు. అయితే, ప్రజాభిప్రాయం తెలుసుకోవడం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
తాను మోడీపై పోటీ చేయాలో వద్దో వారణాసి ప్రజలనే అడుగుతానని చెప్పారు. ఇంతకుముందు ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయమై కూడా ఆయన రిఫరెండం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే, మార్చి 23న వారణాసిలో కేజ్రీ తలపెట్టిన సభ వాయిదాపడింది. ఆ మరుసటి రోజున సభ జరిపేందుకు ఆమ్ ఆద్మీ వర్గాలు నిర్ణయించాయి.