: జూన్ 2నుంచి అధికారికంగా రెండు రాష్ట్రాలు: జైరాం రమేష్
జూన్ 2 నుంచి రెండు రాష్ట్రాలు అధికారికంగా ఏర్పడతాయని కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ స్పష్టం చేశారు. ఆలోగా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. విద్య, విద్యుత్, నీరు మొదలైన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం 19 కమిటీలను ఏర్పాటు చేసిందని తెలిపారు. అన్ని కమిటీలు ఈ నెలఖరులోగా తమ నివేదికలు అందజేస్తాయని వెల్లడించారు. రాష్ట్ర విభజనపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించామని చెప్పారు. త్వరలో నిపుణుల కమిటీ కొత్త రాజధానిని నిర్ణయిస్తుందని తెలిపారు.