: నందన్ నీలేకని దంపతుల ఆస్తుల వెల్లడి


ఆధార్ ఛైర్మన్ పదవికి ఇటీవల రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన నందన్ నీలేకని దక్షిణ బెంగళూరు నుంచి లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన ఈ రోజు నామినేషన్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే (గురువారం) తన పేరిట, తన భార్య రోహిణి పేరిట ఉన్న ఆస్తులను వెల్లడించారు. మొత్తం తమ పేరుతో రూ.7,700 కోట్ల ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. నీలేకని దంపతుల సంపదలో దాదాపు 80 శాతం ఇన్ఫోసిస్ లో వాటాల రూపంలో ఉంది. ఈ కంపెనీలో నీలేకనికి 1.45 శాతం, భార్యకు 1.3 శాతం వాటాలు ఉన్నాయి. ఈ క్రమంలో మాట్లాడిన నీలేకని, ఐఐటీ నుంచి పట్టా పుచ్చుకున్నాక తన జేబులో ఉన్న రూ.20లతో జీవితాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. రూ.10వేలతో ఇన్ఫోసిస్ ను స్థాపించినట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News