: యూపీ బరిలో నలుగురు 'గాంధీ'లు!
గత ఎన్నికల సీన్ పునరావృతం కానుంది. 2009లో వలే ఈ పర్యాయం కూడా ఉత్తరప్రదేశ్ నుంచి నలుగురు 'గాంధీ'లు ఎన్నికల్లో పోటీపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి అధినేత్రి సోనియా రాయ్ బరేలీ... ఆమె కుమారుడు రాహుల్ అమేథీ స్థానాల నుంచి పోటీ చేస్తుండగా... సోనియా తోడికోడలు మేనకా గాంధీ, ఆమె తనయుడు వరుణ్ గాంధీ బీజేపీ తరపున బరిలో ఉన్నారు. మేనక పిలిభిత్ బరిలో ఉండగా, వరుణ్ సుల్తాన్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.