: కలెక్షన్ల కోసమే కేసీఆర్ పోలవరం జపం: పొంగులేటి
కలెక్షన్ల కోసమే టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పోలవరం అంశాన్ని తెరమీదకు లాగుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తన బంధువుకు పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కకపోవడంతోనే కేసీఆర్ పోలవరం డిజైన్ మార్చాలని కొత్త పల్లవి అందుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుట్రపూరిత రాజకీయాలను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పోలవరం డిజైన్ మార్చేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.