: పోలీసుల అదుపులో దేవేందర్ గౌడ్ కుమారుడు
ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారనే ఆరోపణలపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరేందర్ తో పాటు మరికొందరిని కూడా పీఎస్ కు తరలించారు. వీరేందర్ ప్రస్తుతం ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు.