: పవన్ కల్యాణ్, బాబు, జేపీ తహతహలాడుతున్నారు: రాఘవులు
మతతత్వ బీజీపీతో పొత్తు కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తహతహలాడుతున్నారని సీపీఎం నేత రాఘవులు మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆ పార్టీల కలయిక ఆశ్చర్యంగా ఉందని అభిప్రాయపడ్డారు. సీమాంధ్రలో మతతత్వ బీజేపీ బలపడడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక పార్టీలతో తాము పొత్తుకు సిద్ధమని చెప్పిన రాఘవులు కాంగ్రెస్ తో పొత్తు కారణంగా సీపీఐతో దోస్తీ తెగిపోతుందని అన్నారు.