: ప్రతిష్ఠాత్మక కాంగ్రెస్ సభకు జనం లేరు...చిరంజీవిని చూడ్డానికి కూడా రాలేదు


కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బస్సుయాత్ర జనం లేక వెలవెలబోయింది. కేంద్ర మంత్రులు, మాజీ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పెద్దఎత్తున హాజరయిన బస్సు యాత్ర సభకు కార్యకర్తలు లేకపోవడం విశేషం. కేంద్ర మంత్రి చిరంజీవి చరిష్మా కూడా శ్రీకాకుళం అభిమానులను ఆకర్షించలేకపోయింది. టెంట్లు, వేదిక, కుర్చీలు వేసిన కార్మికులను తప్పిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు లేకుండా పోయారు.

కనీసం చిరంజీవి అబిమానులు కూడా అటువేపు వచ్చిన దాఖలాలు లేవు. సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతున్నప్పుడు పట్టుమని పది మంది కూడా కరతాళధ్వనులు చేయలేదంటే శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News