: అందుకే మోడీనీ ప్రధాని అభ్యర్థిగా అంగీకరిస్తున్నాం: వెంకయ్యనాయుడు


దేశంలో ఎన్ని అక్రమాలు, అరాచకాలు జరుగుతున్నా ప్రధాని మన్మోహన్ సింగ్ మౌనంగా ఉంటారని బీజేపీ నేత వెంకయ్య నాయుడు విమర్శించారు. నరేంద్ర మోడీ గట్టి నిర్ణయాలు తీసుకుంటారనే ఆయనను ప్రధాని అభ్యర్థిగా అంగీకరిస్తున్నామని వెంకయ్య చెప్పారు. అనంతపురంలో బీజేపీ నిర్వహించనున్న ప్రజాచైతన్య  సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా వెంకయ్య మీడియాతో మాట్లాడారు. అక్టోబర్లో ముందస్తు ఎన్నికలు రావచ్చని అభిప్రాయపడ్డారు. .

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నేడు అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న మైదానంలో ప్రజా చైతన్య సదస్సు జరుగుతుంది. ముఖ్యఅతిథిగా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు హాజరుకానున్నారు. సదస్సు అనంతరం తిరిగి వెంకయ్యనాయుడు బెంగళూరు వెళతారు. 

  • Loading...

More Telugu News