: ఆ 'పన్నెండు' పేర్లలో మీ పేరు ఉంటే డిస్కౌంట్ పై ఎయిర్ టికెట్!


వర్జిన్ అట్లాంటిక్ విమానయాన సంస్థ భారత ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా వినిపించే 12 పేర్లతో ఓ జాబితా రూపొందించిన వర్జిన్... ఆ జాబితాలో ఉన్న పేర్లతో ఎవరైనా ప్రయాణికులు ఉంటే వారికి ఎయిర్ టికెట్లను డిస్కౌంట్ పై అందించనుంది. 'ఫీల్ లైక్ ఏ స్టార్' పథకం పేరిట ఈ జాబితాలో ఉన్న పన్నెండు పేర్లు ఇవే... కరణ్, సిమ్రాన్, ఆంటోనీ, టీనా, విజయ్, పూజా, అర్జున్, ప్రియా, రాహుల్, కిరణ్, రోహిత్, సోనియా. ప్రయాణికుల్లో ఎవరి పేరులోనైనా ఈ జాబితాలో ఉన్న పేరు ఉంటే 5 శాతం రాయితీపై ఎకానమీ క్లాస్ లోనూ, 10 శాతం రాయితీపై ప్రీమియం ఎకానమీ క్లాస్ లోనూ ప్రయాణించవచ్చు.

స్థానికతను ప్రతిబింబించేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని వర్జిన్ అట్లాంటిక్ భారత విభాగం జనరల్ మేనేజర్ స్టీఫెన్ కింగ్ చెప్పారు. ఈ సదుపాయం జులై 31 లోపు ప్రయాణించేవారికే అందుబాటులో ఉంటుంది. బుకింగ్స్ ఏప్రిల్ 17 వరకే చేపడతారు.

  • Loading...

More Telugu News