: సీమాంధ్ర, తెలంగాణల్లో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం: జవదేకర్
బీజేపీతోనే సీమాంధ్ర, తెలంగాణల్లో అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్రకు ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేరాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు. రాయలసీమ, కోస్తాంధ్రల్లో నీటి సమస్యలు తీరుస్తామని ఆయన తెలిపారు. బీజేపీకి సీమాంధ్ర తరపున ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకపోయినా సీమాంధ్ర హక్కుల కోసం పోరాడిందని ఆయన తెలిపారు.