: ఇంటికి దొంగ వస్తే మొబైల్ కు మెస్సేజ్ వస్తుంది


మహారాష్ట్రలోని థానే పట్టణానికి చెందిన ఆరుగురు పాఠశాల విద్యార్థులు ఒక చక్కని పరికరాన్ని తయారు చేశారు. దీని పేరు రోబో నంది. మనం లేనప్పుడు.. మనింటికి ఎవరైనా వచ్చి తాళం బద్దలు కొడుతున్నా.. ఏదైనా వస్తువును ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసినా వెంటనే మొబైల్ కు మెస్సేజ్ పంపి అప్రమత్తం చేస్తుంది. దీంతో వెంటనే మనం పక్కింటి వాళ్లకో, లేదా స్నేహితులకో ఫోన్ చేసి దొంగల భరతం పట్టమని కోరడానికి అవకాశం ఉంటుంది. రోబోనంది త్వరలోనే మార్కెట్లోకి వస్తుందని.. విద్యార్థులకు గైడ్ గా వ్యవహరించిన పురుషోత్తం పాండే మీడియాకు తెలిపారు. సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని.. రోబోనంది అయితే తక్కువ ఖర్చులోనే చోరీలను నివారించేందుకు తోడ్పడుతుందని వివరించారు. దొంగ ఎలాంటి చప్పుడు లేకుండా పని కానిస్తున్నా పసిగట్టి మెస్సేజ్ పంపిస్తుందన్నారు.

  • Loading...

More Telugu News