: సెహ్వాగ్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటేస్తానంటున్న విదేశీ క్రికెటర్
తాను ఎన్నికల్లో పోటీ చేయడంలేదని విధ్వంసక ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పష్టత ఇచ్చినా, స్టార్ బ్యాట్స్ మన్ కెవిన్ పీటర్సన్ మాత్రం పోటీ చేయాల్సిందేనంటున్నాడు. సెహ్వాగ్ ఎన్నికల బరిలో దిగితే తాను ఓటేస్తానని హామీ కూడా ఇస్తున్నాడు (సరదాగానే). ట్విట్టర్లో వీరూ క్లారిటీ ఇవ్వగానే, కేపీ వెంటనే రీ-ట్వీట్ చేశాడు. దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీచేస్తాడని మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.