: టర్కీలో ట్విట్టర్ గొంతు నొక్కేశారు!


టర్కీలో ట్విట్టర్ మూగబోయింది. దేశ ప్రజలకు ట్విట్టర్ యాక్సెస్ లేకుండా ప్రభుత్వం బ్లాక్ చేసేసింది. ప్రధానమంత్రి రెసెప్ తయ్యిప్ ఎర్డోగెన్ కార్యాలయంలోని రహస్య అవినీతి వ్యవహారాలు ట్విట్టర్ ద్వారా వెలుగులోకి వస్తుండడమే ఈ పరిస్థితికి కారణం. ఈ మంటతోనే ట్విట్టర్ ను దేశంలో నిషేధిస్తామని, అంతర్జాతీయ సమాజం ఏమనుకున్నా తమకు సంబంధం లేదని నిన్న స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టర్కీ ప్రధాని ఎర్డోగెన్ అన్నారు. ఆయన అలా అన్న కొద్దిసేపటికే టర్కీ వ్యాప్తంగా ట్విట్టర్ మూగబోవడం గమనార్హం. అయితే, దేశ చట్టాలను పాటించనందువల్లే ట్విట్టర్ ను నిలిపివేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది

  • Loading...

More Telugu News