: టీడీపీలో చేరిన తోట నరసింహం, మాజీ ఎంపీ రవీంద్ర
కొద్ది రోజుల నుంచి తెలుగుదేశం పార్టీలోకి వరుసగా పలువురు నేతలు చేరుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉదయం మాజీ మంత్రి తోట నరసింహం ఆ పార్టీలో చేరారు. టీడీపీ అదినేత చంద్రబాబు నివాసంలో ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. అటు మాజీ ఎంపీ చిట్టూరి రవీంద్ర కూడా టీడీపీలో చేరారు.